లోన్ ఈఎంఐలు కట్టకపోతే జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందా..?

-

ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థిక సమస్యలు రావడం సహజమే. సరైన నిర్ణయాలను తీసుకోకపోవడం మరియు అనుకోని పరిస్థితుల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అటువంటి సందర్భాల్లో, చాలా శాతం మంది వారి అవసరాల కోసం పర్సనల్ లోన్ తీసుకుంటారు. అయితే కొన్ని కారణాల వలన వాటిని కట్టడానికి ఇబ్బంది పడతారు. దీంతో బ్యాంక్ మరియు ఫైనాన్షియల్ సంస్థల నుండి ఎన్నో ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఈఎంఐ కట్టకపోవడం వలన నోటీసులతో పాటు, జైలుకు పంపే అవకాశాలు ఉన్నాయని అందరూ భావిస్తారు. కానీ ఇటువంటి చర్యలను కొన్ని దశల్లో తీసుకోవడం జరుగుతుంది.

ఎప్పుడైతే పర్సనల్ లోన్‌కు సంబంధించిన ఈఎంఐ లను కట్టరో, బ్యాంకు నుండి ఫోన్ కాల్స్ మరియు మెసేజెస్ వస్తాయి. కేవలం ఎందుకు చెల్లించలేదు అని మాత్రమే ప్రశ్నించడం జరుగుతుంది. ఈ దశలో బ్యాంకు సాధారణంగా వ్యవహరిస్తుంది. అదే విధంగా మూడు నుండి ఆరు నెలలపాటు కొనసాగితే, బ్యాంక్ రికవరీ ఏజెంట్లను పంపిస్తుంది. రెండవ దశలో, రికవరీ ఏజెంట్లు మీ ఇంటికి రావడం లేదా ఫోన్ కాల్ చేసి మాట్లాడడం వంటివి చేస్తారు. కానీ ఎటువంటి బెదిరింపులు చేయకూడదు. కొన్ని సందర్భాల్లో చెల్లింపు గ్రూప్ ద్వారా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది.

మూడవ దశలో బ్యాంకు చట్టపరమైన చర్యలను తీసుకుంటుంది మరియు నోటీసులను పంపుతుంది. ఇది సివిల్ కేసుగా పరిగణించబడుతుంది. అయితే పర్సనల్ లోన్ సెక్యూర్డ్ లోన్ కావడం వలన, బ్యాంకు మీ ఆస్తులను జప్తు చేయదు. కానీ మీ ఆదాయంతో రికవరీ చేయడానికి కోర్టు నుండి ఆదేశాలు తీసుకుంటుంది. ఎప్పుడైతే పర్సనల్ లోన్‌కు సంబంధించిన ఈఎంఐను సకాలంలో చెల్లించరో, మీ సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. దీని వల్ల భవిష్యత్తులో క్రెడిట్ కార్డులను పొందడం మరియు రుణాలు తీసుకోవడం కష్టమవుతుంది. అయితే ఆరు నెలల పాటు ఈ రుణం చెల్లించకపోయినా, ఎలాంటి జైలు శిక్ష ఉండదు. పర్సనల్ లోన్ సివిల్ కేసు అవ్వడం వలన, బ్యాంకు కోర్టులో దాఖలు చేస్తుంది. తర్వాత కోర్టు మీ ఆదాయం లేదా ఆస్తుల నుండి రికవరీ చేయమని ఆదేశిస్తుంది. ఈ విధంగా బ్యాంకు రికవరీ చేయడానికి ప్రయత్నిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news