ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణ ప్రజలకు ఊహించని షాక్ తగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పురపాలక సంఘాల్లో ఉన్న ప్రజలపై భారం మోపేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్తి పన్ను పెంచాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుందని ప్రాథమిక సమాచారం అందుతుంది. పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న వారిపై దాదాపు 20 శాతం అదనంగా బాధలని ప్లాన్ చేస్తున్నారట. మొత్తం 464 కోట్లు వసూలు అయ్యేలా లక్ష్యం పెట్టుకున్నారట.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల నుంచి.. ఆదాయాన్ని సమకూర్చుకునేలా చర్యలు తీసుకోబోతున్నట్లు.. సోషల్ మీడియా లో కథనాలు వస్తున్నాయి. వచ్చే నెల 15వ తేదీ నాటికి ఆయా మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్లు, నగర పంచాయతీల లో సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆస్తుల కొలతలు తీసుకోవాలని కూడా చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ కొలతలు వచ్చిన తర్వాత అదనంగా 20% ఆస్తిపన్ను వసూలు చేసే ఛాన్స్ లో ఉన్నట్టు తెలుస్తోంది.