ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఏపీకి రానున్న 3 రోజులు భారీ వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైస్సార్ కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూ.గో., ప.గో., కోనసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటన చేసింది.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీకి రానున్న 3 రోజులు భారీ వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖా వార్నింగ్ ఇచ్చింది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వానలు పడనున్నాయి. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.