కేసీఆర్ చుట్టూ అన్ని దెయ్యాలు ఉన్నాయి – కవిత

-

కేసీఆర్ కు రాసిన లేఖ పై కల్వకుంట్ల కవిత రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ దేవుడు.. కానీ, కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయని బాంబు పేల్చారు కవిత. అలాంటివాళ్ల వల్ల చాలా నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కవిత ఈ సందర్బంగా మాట్లాడారు.

kavitha
Kalvakuntla Kavitha reacts to the letter written to KCR

ఈ సందర్బంగా కవితకు ఘనంగా స్వాగతం పలికారు జాగృతి, బీసీ సంఘాల నాయకులు. కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమం కోసం ఈ నెల 16న అమెరికా వెళ్లిన కవిత… అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అంతరంగికంగా కేసీఆర్‌కు రాసిన లేఖ బహిర్గతం కావడం బట్టి పార్టీలో ఏం జరుగుతుందో ఆలోచించుకోవాలని సూచనలు చేశారు.  కేసీఆర్ కు రాసిన లేఖ వాస్తవమే అన్నారు కల్వకుంట్ల కవిత.

Read more RELATED
Recommended to you

Latest news