Notices issued once again to Harish Rao and Etala Rajender; తెలంగాణ మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ కు మరో షాక్ తగిలింది. మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ కు మరోసారి నోటీసులు ఇచ్చింది కాళేశ్వరం కమిషన్. విచారణ తేదీని సవరిస్తూ నోటీసులు జారీ చేసింది కాళేశ్వరం కమిషన్.

జూన్ 6వ తేదీన ఈటల, 9వ తేదీన హరీష్ రావు విచారణకు హాజరు కావాలన్న కమిషన్… మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ కు మరోసారి నోటీసులు ఇచ్చింది. అంతకుముందు నోటీసుల్లో 6వ తేదీన హరీష్ రావు, 9వ తేదీన ఈటల విచారణకు రావాలని పేర్కొంది కాళేశ్వరం కమిషన్. కమిషన్ విచారణకు హాజరు అవుతానని పేర్కొన్నారు ఈటల రాజేందర్. ఇక ఇదే కేసులో కేసీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.