సామాన్యులకు ఊరట లభించింది. అదే సమయంలో అన్నదాతలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టమాట ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఉమ్మడి చిత్తూరు అలాగే అన్నమయ్య జిల్లాలలో… టమాటా ధరలు.. దారుణంగా పడిపోయాయి. ఈ రెండు జిల్లాలలో 20k హెక్టార్లలో ఈ పంటను సాగు చేస్తూ ఉంటారు. గత సంవత్సరం ఇదే సీజన్ లో 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు… టమాటాలు ధర పలికాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది.

మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలకు కిలో టమోటాలు వెళ్తున్నాయి. అంటే ఎకరాకు రెండున్నర లక్షల పెట్టుబడి పెడితే చేతికి 34 వేల రూపాయలు మాత్రమే వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. వ్యాపారులు మాత్రం ప్రజలకు కిలో ₹20 చొప్పున.. కొన్ని ప్రాంతాల్లో విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై దృష్టి సారించాలని కోరుతున్నారు.