కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి గాను కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా న్ని విమాన సర్వీసులను కేంద్ర ప్రభుత్వం రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గ దర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి 29 వరకు విమాన సర్వీసులను రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది.
65 ఏళ్ళు దాటిన వాళ్ళు అందరూ ఇళ్ళల్లోనే ఉండాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. 10 ఏళ్ళ లోపు పిల్లలను బయటకు పంపవద్దని సూచించింది. దేశ వ్యాప్తంగా న్ని ప్రత్యేక రైళ్ళు రద్దు చేసింది కేంద్రం. అన్ని అంతర్జాతీయ సర్వీసులతో పాటుగా సరిహద్దులను కూడా మూసి వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలను కఠినంగా అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది.
22వ తదీ నుంచి 29 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసారు. వారం పాటు సరిహద్దులను మూసి వేసారు. అవకాశం ఉన్న ప్రతీ ప్రైవేట్ కంపెనీ వర్క్ ఫ్రొం హోం ఇవ్వాలని ఆదేశించింది. కఠినం గా నిర్ణయాలను అమలు చెయ్యాలని ఆదేశాలు ఇచ్చింది. ఎవరు నిబంధనలను ఉల్లంఘించినా సరే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. లాక్ డౌన్ భయాలు అవసరం లేదని చెప్పింది.