ఉరి తీసే ముందు మినిట్ టూ మినిట్ ఎం జరిగింది…!

-

ఏడేళ్ళుగా ఎదురు చూస్తున్న నిర్భయ దోషులకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. శిక్ష ఆలస్యం అయింది గాని రద్దు కాలేదు. ఎన్ని పిటీషన్లు వేసినా సరే వారికి శిక్ష మాత్రం ఆగలేదు. శుక్రవారం ఉదయం తీహార్ జైల్లో నలుగురు దోషులకు శిక్ష అమలు అయింది. దీనితో యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తుంది. నిర్భయ కుటుంబ సభ్యులు కూడా శిక్ష అమలుపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ బిడ్డకు ఇన్నాళ్ళకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఉరిశిక్ష ముందు అసలు మినిట్ టూ మినిట్ ఎం జరిగింది అనేది చూద్దాం.

తెల్లవారుజామున 4.00 గంటలకు తీహార్ జైలు అధికారులు నలుగురు దోషులను నిద్ర లేపి స్నానం చెయ్యాలని కోరారు. 4.15 నిమిషాలకు… ఉరికి ముందు చివరి సారిగా దేవుడ్ని తలుచుకుని పూజలు చెయ్యాలని జైలు సిబ్బంది సూచించగా వద్దని చెప్పారు దోషులు. నలుగురు దోషులకు టిఫిన్ పెట్టారు. అడిగిన టిఫిన్ వారికి అందించారు.

4.30 గంటలకు, నలుగురు దోషులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. వాళ్ళు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు చెప్పారు. ఉరి శిక్ష ఆపివేయాలని నోటీసు గాని లేఖ గాని ఏమైనా వచ్చిందా అని తనిఖీ చేయగా అది ఏమీ లేదని నిర్ధారించుకున్నారు.

తెల్లవారుజామున 5.20 గంటలకు… ముఖాలను వస్త్రంతో కప్పి, చేతులు వీపు వెనకు కట్టి తిహార్ జైలు కాంప్లెక్స్ లోని ఉరికంబాల వద్దకు తరలించారు.

ఉదయం 5.25 గంటలకు… ఉరికంబం ఎక్కించే ముందు జిల్లా మెజిస్ట్రేట్ దోషుల కోరికను అడిగగా వాళ్ళు ఏమీ లేదని చెప్పారు. దోషుల డెత్ వారెంటుపై కౌంటర్ సంతకం చేసేసారు. 5.40 గంటలక నలుగురు దోషులకు మరణశిక్ష విధించారు అధికారులు. నలుగురు దోషులను ఉరి తీసామని తిహార్ జైలు డైరెక్టరు జనరల్ సందీప్ గోయెల్ ధ్రువీకరించారు.

6.00 గంటలకు… నలుగురు దోషులు మరణించారని వైద్యులు ధ్రువీకరించగా.. 7; 00 గంటలకు… నలుగురు దోషుల మృతదేహాలను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news