పదివేలు దాటిన కరోనా మృతుల సంఖ్య

-

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ రోజు రోజుకీ తన ప్రభావాన్న పెంచుతోంది. ఇప్పటికే కరోనా మరణాలు సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచం చిగురుటాకులా వణుకుతోంది. కరోనా వైరస్ పుట్టిన చైనాలో దాని ప్రభావం తగ్గుముఖం పట్టినా ఇతర దేశాల్లో మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటలీలో మాత్రం కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది.

ఇప్పటి వరకూ చైనాలోనే కరోనా మరణాలు అధికంగా ఉండగా ఇప్పుడు ఇటలీ దానిని దాటింది.ఇప్పటి వరకూ కరోనా వైరస్ 117 దేశాలకు వ్యాప్తి చెందగా 10 వేల మందికి పైగా దీని బారిన పడి మృతి చెందినట్టు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2, 45,600 లకు చేరుకుంది.

భారత్ లో కూడా కరోనా బాధితులు సంఖ్య 200 కు చేరుకుంది. పంజాబ్ కు చెందిన మరో వ్యక్తి కరోనా కారణంగా మృతి చెందాడు. రెండు రోజులుగా దేశంలో కొత్త కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. రెండు రోజుల్లోనే 54 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news