జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవలే తీవ్ర అనారోగ్యంతో జూబ్లీహిల్స్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో పోటీ చేసేందుకు నేతలందరూ కోటి పడుతున్నారు. ఇందులో భాగంగానే రేసులో నేను ఉన్నానంటూ మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ ప్రకటించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ను బీఆర్ఎస్ అధిష్టానం తమ కుటుంబానికే కేటాయించిందని గోపీనాథ్ సోదరుడు అన్నారు. అయితే కుటుంబంలో ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారనేది బీఆర్ఎస్ పార్టీ నిర్ణయిస్తుందన్నారు. తాను కూడా టికెట్ రేసులో ఉన్నానని వజ్రనాథ్ వెల్లడించారు. 2014 నుంచి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో తిరుగుతున్నానని, గోపీనాథ్ లేని లోటును తాను కూర్చగలనని బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నట్లుగా గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ అన్నారు. ప్రస్తుతం వజ్రనాథ్ చేసిన ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం పైన త్వరలోనే క్లారిటీ రానుంది.