ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలెర్ట్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో జిల్లా ఏర్పాటు కానుంది. ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. గతంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ జిల్లా ఏర్పాటుపై ప్రజలకు హామీ ఇచ్చారు.

దీంతో చాలా సంవత్సరాల తర్వాత త్వరలోనే ప్రజల కల నెరవేరంతోంది. కాగా… మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి, దర్శి నియోజకవర్గాలతో మరో కొత్త జిల్లా ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. త్వరలోనే ఈ విషయం పైన మరింత క్లారిటీ రానుంది. దీంతో మార్కాపురం వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంవత్సరాల వారి కళ నెరవేరుతోందని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.