ఎల్లుండి కేటీఆర్ చర్చకు రమ్మన్నాడని రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నాడు అని చురకలు అంటించారు హరీష్ రావు. కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద కోపంతో రేవంత్ రెడ్డి రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని మండిపడ్డారు. మేడిగడ్డ దగ్గర ఈ నిమిషంలో 73,600 క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తున్నాయి.. గోదావరి నది 96 మీటర్ల లెవెల్లో ప్రవహిస్తుందని పేర్కొన్నారు.

కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కావలసిన దానికంటే ఎక్కువ ఎత్తులో గోదావరి ప్రవహిస్తుంది.. మోటార్లు ఆన్ చేస్తే చాలు, రైతులకు నీళ్లు ఇవ్వొచ్చు అన్నారు. కానీ నీళ్లు ఎత్తి పోయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు.. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ అని తెలిపారు హరీష్ రావు.
పోలవరం డయాఫ్రం వాల్, గైడ్ వాల్ కొట్టుకుపోయి రూ.2000 కోట్లు నష్టం అయితే NDSA అక్కడికి వెళ్లదని తెలిపారు. SLBC టన్నెల్ కూలిపోయి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్ధకంలో పడితే NDSA రాదన్నారు. అదే మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే కిషన్ రెడ్డి NDSAను వెంటనే పంపిండు.. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డితో కలిసి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు.