ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఇకపై నెలకు 600 రూపాయలు ఇవ్వబోతున్నట్లు తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు దూరంగా ఉండటం వల్ల… విద్యార్థులకు రవాణా చార్జీలను చెల్లించాలని తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.

47.19 కోట్లు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అయితే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నెలకు రూ. 600 రవాణా భత్యం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఇంటికి, ప్రభుత్వ పాఠశాలకు కనీసం కిలోమీటర్ కన్నా ఎక్కువ దూరం ఉన్నట్లయితే ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు రవాణా భత్యం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే 6, 7, 8వ తరగతి విద్యార్థులు రవాణా భత్యం పొందాలంటే స్కూల్ నుంచి వారి ఇంటికి కనీసం మూడు కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ఉండాలి.