తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతుంది. నిన్న 76,501 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29, 033 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.39 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ సంస్థ వెల్లడించింది. భక్తులు కంపార్ట్మెంట్లలో నిండిపోయి శిలా తోరణం వరకు క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు.

ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం తొందరగా అయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు నీటి సదుపాయం, భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. మరోవైపు ఏపీలో వర్షాలు అధికంగా కురుస్తున్నప్పటికీ భక్తులు ఏ మాత్రం పట్టించుకోకుండా స్వామి వారి దర్శనానికి వెళ్తున్నారు. చిన్న పి ల్లలు ఉన్నవారు జాగ్రత్తగా తిరుమలకు రావాలని ఆలయ అధికారులు సూచనలు చేస్తున్నారు.