కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను ఫిలింనగర్ లోని ఆయన నివాసంలో పరామర్శించారు నటుడు జూనియర్ ఎన్టీఆర్. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ…. నాకు కోటా శ్రీనివాసరావు తో కలిసి ఎన్నో చిత్రాల్లో పని చేసిన అనుభవం ఉందన్నారు.

ఆయన ఒక మహనీయుడైన నటుడు అని పేర్కొన్నారు. నటనకు కోటా శ్రీనివాసరావు నిలువెత్తు రూపం అని చెప్పారు. ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రల్లో చిత్రాల్లో నటించారన్నారు నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ నటుడిగా ఎప్పుడూ జీవించే ఉంటారన్నారు నటుడు జూనియర్ ఎన్టీఆర్.
కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్
నటనకు కోట శ్రీనివాసరావు నిలువెత్తు రూపం అని.. ఆయన పాత్రల ద్వారా ఎప్పటికీ గుర్తు పెట్టుకుందామని తెలిపిన ఎన్టీఆర్#KotaSrinivasaRao #NTR pic.twitter.com/WDS903wlYS
— BIG TV Breaking News (@bigtvtelugu) July 14, 2025