నేడు, రేపు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన..

-

నేడు, రేపు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన ఉండనుంది. ఇవాళ ఉదయం 11.45కు ఢిల్లీకి చేరుకోనున్న చంద్రబాబు…. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు 1-జన్‌పథ్‌లో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సరస్వత్‌తో సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ మెట్రో ఎండీతో చంద్రబాబు భేటీ ఉంటుంది.

CM Chandrababu Naidu's visit to Srisailam tomorrow
AP CM Chandrababu Naidu to visit Delhi today and tomorrow

మధ్యాహ్నం 3.30 గంటలకు సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం ఉంటుంది. రాత్రి 7 గంటలకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఉండనుంది. రేపు ఉదయం 10 గంటలకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయాతో చంద్రబాబు భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు జలశక్తి భవన్‌లో కేంద్ర జల్‌ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశం జరుగనుంది. సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ చంద్రబాబు భేటి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news