తెలంగాణ నీటి పారుదల శాఖ మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ రావు కు బిగ్ షాక్ తగిలింది. కోట్లలో ఆస్తుల నేపథ్యంలో తెలంగాణ నీటి పారుదల శాఖ మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ రావు అరెస్టు అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తెలంగాణ నీటి పారుదల శాఖ మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ రావు ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు.

హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లలో 10 చోట్ల ACB సోదాలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇరిగేషన్ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ గా పని చేసిన మురళీధర్ రావును అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు.