భారతదేశంలో అన్ని వ్యవస్థలు దాదాపు రెండు నెలల పాటు స్తంభించిపోయె అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితులు కనబడుతున్నాయి. దీంతో రానున్న దినాల్లో కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని ఇప్పటికే అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో భారతదేశంలో కూడా ఈ వైరస్ ప్రభావం ఉన్న కొద్ది పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల సరిహద్దులు మూసేస్తున్నారు. రైళ్లు, బస్సులు మాత్రమే కాదు.. క్యాబ్‌లు.. ఆటోలు కూడా తిరగడానికి అవకాశం లేకుండా పోయింది. కేవలం.. నిత్యావసర వస్తువుల సరకుల రవాణాను మాత్రమే అనుమతిస్తున్నారు. బియ్యం, పాలు, కూరగాయాలు లాంటి వాటిని సరఫరా చేస్తున్నారు. ప్రజా రవణా మొత్తం నిలిచిపోతుంది. ఇది కొన్ని లక్షల కుటుంబాలకు ఉపాధి లేకుండా చేస్తుంది. దీంతో చాలా వరకు దేశంలో ఉన్న పేద కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని వాళ్లని ఆదుకోవటం భారతదేశం ముందు ఉన్న అతి పెద్ద సవాల్ అని…దానికన్నా ముందు కరోనా వైరస్ ని అరికట్టాలంటే పర్మినెంట్ గా దేశంలో ఉన్న ప్రజలంతా ఇళ్ల కే పరిమితం అవ్వాలని అందరూ కోరుతున్నారు.
మొత్తంమీద చూసుకుంటే రాబోయే రోజుల్లో భారతదేశంలో ఆర్థిక మాంద్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది…పేదవాళ్ల బతుకులు రోడ్డున పడే భయంకరమైన రోజులు దాగి ఉన్నాయని వాళ్లను ఆదుకోవడమే భారతదేశం ముందు ఉన్న అతిపెద్ద సవాల్ అంటూ చాలామంది ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు.