డిజిటల్ మార్కెట్ నెత్తిన కరోనా పాలు పోసిందా…?

-

ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ అనేది భారీగా పెరిగిపోయింది. మన దేశంలో దీని వాడకం ఎక్కువైపోయింది. అలాగే ఆన్లైన్ లావాదేవీలు కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. చిన్న చిన్న అవసరాలకు కూడా జనం వాటినే ఎక్కువగా వాడుతున్నారు. నోట్ల రద్దు తర్వాత వాటి అవసరం అనేది బాగా పెరిగింది. ఆన్లైన్ లావాదేవీలకు వ్యాపార సంస్థలు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో జనం వాటికి అలవాటు పడుతున్నారు.

ఇప్పుడు కరోనా వైరస్ వచ్చేసింది. ప్రపంచాన్ని కమ్మేసింది… ఎటు వెళ్ళడానికి లేదు, ఎటు తిరగడానికి లేదు. కాబట్టి మన దేశంలో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ లావాదేవీలు అనేవి భారీగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. డబ్బులకు కరోనా అంటుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఆన్లైన్ లోనే చేస్తున్నారు. షాప్ కి వెళ్తే కరోనా విస్తరిస్తుంది కాబట్టి రావడం లేదు బయటకు.

అందరూ ఆన్లైన్ లోనే ఆర్డర్లు చేస్తున్నారు. వ్యాపార ప్రకటనలకు కూడా ఆన్లైన్ మీదే ఎక్కువగా ఆధార పడుతున్నారు ప్రజలు. మన దేశంలో దాదాపు 40 కోట్ల మంది వరకు ఆన్లైన్ మార్కెట్ మీద ఆధార పడ్డారు. ఇప్పుడు గ్రామాల్లో కూడా దీని అవసరం అనేది ఎక్కువగానే ఉంది. ఆన్లైన్ లోనే నగదు బదిలీ లు ఎక్కువగా చేస్తున్నారు. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటి వాడకం బాగా పెరిగింది ఈ మధ్య కాలంలో.

కాబట్టి కరోనా పుణ్యమా అని ఇవి మరింతగా విస్తరించే అవకాశం ఉంది. ప్రతీ ఒక్కరు నగదు ఇచ్చి పుచ్చుకోవడాలు దాదాపుగా మానేసినట్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. చావు ఎటు నుంచి ఎటు వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. కూరగాయల మీద కూడా కరోనా ఉందని అంటున్నారు. దీనితో ప్రజలు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పట్లో బయటకువెల్లి ఏదీ కొనే పరిస్థితి దాదాపుగా లేదనే చెప్పాలి. కాబట్టి డిజిటల్ లావాదేవీలు, డిజిటల్ వ్యాపారం మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news