అవును ఇప్పుడు ప్రజలు అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోడ్ల మీదకు రావొద్దని ప్రభుత్వాలు కోరుతున్నా సరే ప్రజలు మాత్రం మాట వినే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. ఒక్క రోజు జనతా కర్ఫ్యూ ని విజయవంతం చేసిన ప్రజలు మళ్ళీ సోమవారం నుంచి రోడ్ల మీదకు వచ్చేశారు. రోడ్ల మీద కూరగాయలు, అదీ ఇదీ అంటూ తిరుగుతూ నిన్న చేసింది అంతా నాశనం చేసారు.
ఇటలీ, అమెరికా లాంటి దేశాలు ఇలాగే తక్కువ అంచనా వేసాయి. ఏ విధంగా చూసినా సరే అక్కడి ప్రజలు మాత్ర౦ మాట వినలేదు. దీనితో అన్ని విధాలుగా వైరస్ విస్తరించింది. ఇప్పుడు లాక్ డౌన్ ప్రకటిస్తే ప్రజలు అందరూ రోడ్ల మీదకు వస్తున్నారు. దీనితో భారీగా నష్టం జరుగుతుంది అనే విషయం అర్ధమవుతుంది. లాక్ డౌన్ చేసినా సరే జనాలు ఏదో పని ఉన్నట్టు పనిలేని పనికి కూడా తిరుగుతున్నారు రోడ్ల మీద.
కుర్రాళ్ళు పెద్దలు అందరూ కూడా ఇప్పుడు రోడ్ల మీదకు వచ్చేశారు. దీనితో ఆందోళన అనేది వ్యక్తమవుతుంది. మార్చ్ 31 వరకు ఇంట్లో ఉండండి ఏదైనా అవసరం ఉంటే ఒకరు మించి రావొద్దని ప్రభుత్వాలు చెప్తున్నా సరే ఎవరూ వినడం లేదు. కరోనాను అన్ని విధాలుగా స్వాగతిస్తూ ప్రజలు చేస్తున్న కార్యక్రమాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వాలకు సహకరించకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి.