ఫుడ్ డెలివరీ ఆలస్యంగా చేశాడని ఓ మహిళా కస్టమర్ తిట్టడంతో ఆత్మహత్య చేసుకున్నాడు డెలివరీ బాయ్. బి.కామ్ చదువుతున్న పవిత్రన్ సెప్టెంబరు 11న కొరట్టూరు ప్రాంతంలో పుడ్ డెలివరీకి కస్టమర్ ఇంటిని గుర్తించేందుకు సమయం పట్టడంతో ఆలస్యం డెలివరీ చేసాడు. అయితే ఫుడ్ ను ఆలస్యంగా డెలివరీ చేయడంపై పవిత్రన్ ను తిట్టిన కస్టమర్ అటు తర్వాత ఫుడ్ డెలివరీ సంస్థకు పవిత్రన్ పై ఫిర్యాదు చేసింది. అయితే రెండు రోజుల తర్వాత కస్టమర్ ఇంటిపై రాయితో దాడి చేసిన పవిత్రన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది కస్టమర్.
అయితే వరుస ఘటనతో డిప్రెషన్ లోకి వెళ్ళి ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు పవిత్రన్. సూసైడ్ నోట్ లో నా మరణానికి కారణం డెలివరీ సమయంలో వ్యక్తి తిట్టడంతో నేను డిప్రెషన్‌లోకి వెళ్లాను. అలాంటి మహిళలు ఉన్నంత వరకు మరిన్ని మరణాలు సంభవిస్తాయి అంటూ రాసాడు పవిత్రన్. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.