హైదరాబాద్ మహానగరంలో నిన్న కుండపోత వర్షం కురిసింది. జనాలు బయట అడుగుపెట్టకుండా… భారీ వర్షం పడింది. అత్యధికంగా బోయిన్పల్లి అలాగే మారేడుపల్లి లో 11.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉప్పల్ లో 10.1, బండ్లగూడలో 9.9 అలాగే ముషీరాబాద్ లో 9 సెంటీమీటర్ల వర్షం పడింది.

మధ్యాహ్నం మూడు గంటల కు ప్రారంభమైన వర్షం సాయంత్రం ఏడు గంటల వరకు పడింది. దీంతో హైదరాబాద్ నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కాగా తెలంగాణకు బిగ్ అలర్ట్..తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు రాష్ట్రానికి వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇవాళ కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.