తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి ఏకంగా 24 గంటల సమయం పడుతుంది. దీంతో శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు.

ఇక నిన్న ఒక్కరోజే 73,000 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే నిన్న ఒక్కరోజే తిరుమల హుండీ ఆదాయం 4.21 కోట్లు నమోదు అయింది. మరో వారం రోజులు ఇదే పరిస్థితి తిరుమలలో ఉంటుందని చెబుతున్నారు అధికారులు. భక్తులు విపరీతంగా వచ్చినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.