\తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఇవాల్టి నుంచి మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలని కూడా పేర్కొంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి ములుగు భద్రాద్రి సిద్దిపేట రంగారెడ్డి యాదాద్రి మేడ్చల్ హైదరాబాద్ వికారాబాద్ జిల్లాలకు… ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు కూడా భారీ వర్షాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ అల్లూరి, ఏలూరు కృష్ణ గుంటూరు ఎన్టీఆర్ బాపట్ల కడప అన్నమయ్య చిత్తూరు సత్యసాయి తిరుపతి జిల్లాలలో భారీ మించి అది భారీ వర్షాలు పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉన్నట్లు… హెచ్చరికలు జారీ చేసింది.