అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి ఆరోపించారు. ఈ క్రమంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు వచ్చాయని తెలిపారు.
రాష్ట్రంలో వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని మంత్రి నిమ్మల ఫైరయ్యారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ కి ప్రజా స్వామ్యంలో ఉండే అర్హత లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తోందని తెలిపారు. ఈ తరుణంలో సీఎం చంద్రబాబు కావాలా.. వైఎస్ జగన్ కావాలో ప్రజలే తేల్చుకోవాలి అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.