దేవదాస్ ఛాన్స్ మిస్సై.. జెర్సీ ఛాన్స్ కొట్టేసింది..!

-

కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ దేవదాస్. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఇక ఈ సినిమాలో రష్మిక స్థానంలో నటించాల్సిన శ్రద్ధ శ్రీనాథ్ నాని ప్రస్తుతం చేస్తున్న జెర్సీ సినిమాలో ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది.

దేవదాస్ సినిమాలో రష్మిక నానికి జోడిగా నటించింది. అయితే ఆ సినిమా టైంలో అమ్మడు బిజీగా ఉండటం వల్ల ఆ ఛాన్స్ మిస్సైందట. అయితే గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న జెర్సీ సినిమాలో నాని సరసన శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుంది. కన్నడ భామ అయిన శ్రద్ధా శ్రీనాథ్ యూటర్న్ సినిమాలో నటించి మెప్పించింది.

కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ విక్రం వేద సినిమాలో కూడా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. తెలుగులో నాని సినిమాతో ఎంట్రీ ఇస్తుంది శ్రద్ధా శ్రీనాథ్. క్రికెట్ నేపథ్యంతో వస్తున్న జెర్సీ సినిమాలో నాని, శ్రద్ధాల పెయిర్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news