ఆపరేషన్ సిందూర్ సమయంలో మోడీ ప్రభుత్వం 30 నిమిషాల్లోనే పాకిస్తాన్ లో లొంగిపోయిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోడీ ప్రభుత్వం కాల్పుల విరమణ పాటిద్దామని పాకిస్తాన్ ను అడిగింది. ఉద్రిక్తతలు పెంచే ఆలోచన లేదని.. రాజ్ నాథ్ చెప్పారు. అంటే పాకిస్తాన్ తో పోరాడే ఆలోచన లేదని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాల వల్లే మన విమానాలు కూలిపోయాయి. ఐఏఎఫ్ ఎలాంటి తప్పు చేయలేదు. రాజకీయ నాయకత్వమే తప్పు చేసింది అని పేర్కొన్నారు.

ప్రధాని మోడీకి ధైర్యముంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అబద్దాల కోరు అని సభలో ప్రకటించాలని రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. భారత్-పాకిస్తాన్ యుద్దం ఆపానని ట్రంప్ 29 సార్లు చెప్పారు. ఆయన అబద్ధం చెప్పినట్టయితే ఆ విషయాన్ని ప్రధాని మోడీ సభలో ప్రకటించాలి. ఇందిరాగాంధీకి ఉన్న ధైర్యంలో సగమైన మోడీకి ఉంటే ట్రంప్ అబద్దాల కోరు అని చెప్పాలి అని డిమాండ్ చేశారు.