సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఈడీ విచారణ తాజాగా ముగిసింది. దాదాపు 5 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. అతని స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఎలాంటి లబ్ది పొందలేదని ప్రకాశ్ రాజ్ స్టేట్ మెంట్ ఇచ్చినట్టు సమాచారం. బెట్టింగ్స్ యాప్స్ నిర్వాహకుల నుంచి తనకు డబ్బులు అందలేదని మీడియా కి తెలిపారు. బెట్టింగ్ యాప్ ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఇక నుంచి బెట్టింగ్ యాప్ కి ప్రమోషన్ చేయనని వెల్లడించారు ప్రకాశ్ రాజ్. బెట్టింగ్ యాప్స్ వాడకండి.. స్వయంగా సంపాదించండి అని సూచించారు ప్రకాశ్ రాజ్.
ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రకాశ్ రాజ్ బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈ అనుమానిస్తోంది. నిందులుగా ఉన్న పలువురినీ సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రానా జులై 23న విచారణకు రావాలని గతంలో ఈడీ నోటీస్ ఇవ్వగా..విచారణకు రావడానికి కాస్త గడువు కావాలని కోరారు. ఆగస్టు 11న విజయ్ దేవరకొండ హాజరు కానున్నాడు.