శ్రావణమాసానికి హిందూ సాంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో స్త్రీలు ప్రత్యేకంగా పూజలను చేస్తూ ఉపవాసాలు, దేవాలయాలు అంటూ ఎంతో భక్తితో దేవుడిని కొలుస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే శనివారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రావణ శుక్రవారం, మంగళవారం ఎంత ప్రాముఖ్యత ఉన్నాయో శనివారం కూడా ఎంతో విశేషమైన రోజు. ఇక ఆగస్టు 2 శ్రావణమాసం శనివారం అప్పుల బాధ తొలగించుకోవడానికి ఎలాంటి పూజ చేయాలనేది చూద్దాం..
శ్రావణమాసంలో ప్రతిరోజు ఎంతో ప్రాముఖ్యమైనది శ్రావణమాసంలో శ్రీమహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ మాసంలో శనివారం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరునికి ఆరాధన చేయడమనేది ఎంతో శక్తివంతం. శనివారం ఆ శ్రీనివాసునికి బియ్యపు పొంగలి, నువ్వుల లడ్డు, బూందీ లడ్డు, వంటి పదార్థాలను ప్రసాదంగా సమర్పించాలి. శ్రీనివాసుని స్తోత్రాలు,నామాలు,పఠించి, బియ్యప్పిండిలో బెల్లం కలిపి పిండి దీపారాధన చేసి స్వామి వారిని ఆరాధించాలి. మీకు వీలుంటే శ్రావణమాసంలో వచ్చే అన్ని శనివారాలు ఈ విధంగా దీపారాధన చేసి శ్రీ శ్రీనివాసుని పూజించడం వలన అప్పుల బాధల నుంచి విముక్తి కలగడమే కాక, ఎంతో విశేషమైన ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు.
పూజా కాక, ఇవి కూడా చేయొచ్చు :శ్రావణ శనివారం( ఆగస్టు 2న ) ప్రదోషకాలంలో నిద్రలేచి దగ్గరలో ఉన్న రావి చెట్టుకు, తులసి కోటకు, ఆవు నేతితో దీపారాధన చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే శనిదేవుని అనుగ్రహం పొందడానికి అత్యంత అనుకూలమైన రోజులు
శ్రావణ శనివారం శని దేవుడికి తైలాభిషేకం చేయడం వలన ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక అంతేకాక శ్రావణమాసంలో వచ్చే శనివారం ఆంజనేయ స్వామిని ఆరాధించడం హనుమాన్ చాలీసా పఠించడం ఎంతో శ్రేష్టమైనది ఎన్నో బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.
శుభ సమయాలు: శ్రావణమాసం అనే కాక ప్రతిరోజు మనం పూజ చేసుకోవడానికి అనువైన శుభ సమయాలను చూసుకోవాలి. ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో పూజ చేయడం అందరికీ కుదరకపోవచ్చు. అలాంటివారు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల లోపు, లేదా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల లోపు పూజ చేస్తే మంచిది. టైము, స్థలము ముఖ్యం కాదు భక్తి,ఏకాగ్రత ముఖ్యం. ప్రతిరోజు ఒకే సమయానికి పూజ చేయడం అలవాటు చేసుకోవాలి.
శ్రావణ శనివారం రోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి, శనిదేవునికి, హనుమంతునికి భక్తితో ఆరాధన చేయడం ద్వారా అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని హిందువుల నమ్మకం. ఈ పూజలకు కేవలం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాక మానసికంగా ప్రశాంతతను ఆత్మవిశ్వాసాన్ని కూడా అందిస్తాయి.