హరీష్ రావుకు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్..ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ లబ్ది కోసం బనకచర్లపై దుష్ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

అన్నదమ్ముల్లాంటి తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు నిమ్మల రామానాయుడు. అంతకు ముందు లోకేష్‌కు హరీష్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. బనకచర్ల ప్రాజెక్టుపై లోకేష్ పిచ్చి మాటలకు కౌంటర్ ఇచ్చారు. లోకేష్ బనకచర్ల వ్యాఖ్యలపై రేవంత్ ఎందుకు స్పందించట్లేదని ఫైర్ అయ్యారు. పొక్కలు కొట్టుకొని నీళ్లు తీసుకెళ్లేందుకు, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదన్నారు.
మిగులు జలాలపై లోకేష్‌కు అవగాహన లేకుండా అబద్దాలు మాట్లాడుతున్నారని అందిపడ్డారు. రేవంత్ రెడ్డి బలం చూసుకొని బనకచర్లపై లోకేష్ మాట్లాడుతున్నాడు…. బీజేపీ మా చేతుల్లో ఉంది.. మేం ఏం చెప్తే అదే చేస్తారని అనుకుంటే ఉరుకోబోమని ఫైర్ అయ్యారు.