స్నానం చేయడం శరీరాన్ని ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచడమే కాక చర్మం అందాన్ని కాపాడుతుంది. ఇక అలాగే తలస్నానం చేయడం జుట్టు అందాన్ని సురక్షితంగా కాపాడుతుంది. అయితే స్నానం తర్వాత కొన్ని సాధారణ తప్పులు చేయడం వల్ల చర్మం పొడిబారడం, జుట్టు రాలడం,వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. స్నానం తర్వాత నివారించాల్సిన ఈ ఐదు తప్పులని ఇప్పుడు మనం చూద్దాం..
చర్మాన్ని గట్టిగా రుద్దడం : స్నానం చేసిన తర్వాత చర్మాన్ని గట్టిగా టవల్ తో రుద్దడం వల్ల చర్మం యొక్క సహజమైన తేమా పోతుంది. ఇది చర్మం పొడిబారడానికి, దురదకు దారితీస్తుంది. అలా చేయకుండా మృదువైన టవల్ తో చర్మాన్ని సున్నితంగా అద్దడం లాంటివి ఉత్తమం ఇది చర్మంలోని సహజమైన తేమను కాపాడుతుంది అందాన్ని నిలుపుతుంది.
మాయిశ్చరైజర్ వాడకపోవడం : స్నానం చేసిన తర్వాత చర్మం తేమగా ఉన్నప్పుడు మాయిశ్చరైజర్ రాయడం చాలా ముఖ్యం. ఈ సమయంలో చర్మం తేమను కలిగి ఉంటుంది మాయిశ్చరైజర్ వాడకపోతే చర్మం పొడి బారిపోయి గరుకుగా మారుతుంది. మార్కెట్ లో దొరికే మాయిశ్చరైజర్ కన్నా ఇంట్లో సహజంగా దొరికే ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె వంటి వాటిని వాడడం వలన చర్మం మృదువుగా ఆరోగ్యంగా ఉంటుంది.
తడి జుట్టు గట్టిగా దువ్వడం : చాలామంది తలస్నానం చేసిన తరువాత వెంటనే చిక్కు తీసుకోవడానికి తలని గట్టిగా దువ్వుతారు అలా తడిగా ఉన్న జుట్టును దువ్వడం వలన జుట్టు రాలుతుంది. జుట్టు చివర చీలికలు వస్తాయి. జుట్టు ఆరిన తర్వాత వెడల్పు దంతాల దువ్వెనతో సున్నితంగా దువ్వితే జుట్టు రాలడం నివారించవచ్చు. ఇక అలాగే కండిషనర్ వాడడం వలన జుట్టు మృదువుగా ఉంటుంది.
గట్టిగా ఉండే బట్టలు ధరించడం: స్నానం చేసిన తరువాత గట్టిగా వుండే సింథటిక్ బట్టలను ధరించడం వల్ల చర్మం టైట్ గా అయిపోతుంది దీనివల్ల చర్మంపై దురదలు దద్దుర్లు వస్తాయి. స్నానం తర్వాత బదులుగా ఉండే కాటన్ బట్టలు ధరించడం చర్మం సౌకర్యవంతంగా ఉంటుంది మరియు తేమను నిలుపుకుంటుంది.
వేడి వాతావరణానికి దూరం : చర్మం చాలా సున్నితంగా ఉంటుంది స్నానం చేసిన వెంటనే వేడి ప్రాంతంలోకి వెళ్లడం, సూర్యకిరణాలు తడి చర్మాన్ని సులభంగా దెబ్బతీస్తాయి. ఎక్కువగా ఎండ ఉన్న ప్రాంతంలో స్నానం చేసిన వెంటనే వెళ్లడం వలన చర్మం రంగు మారే సమస్య వస్తుంది. స్నానం తర్వాత కొద్ది సమయం గడిచాక సన్ స్క్రీన్ రాసుకొని బయటికి వెళ్లడం మంచిది.
స్నానం తర్వాత చేసే చిన్న చిన్న తప్పులు చర్మం, జుట్టు అందాన్ని దెబ్బతీస్తాయి. కొన్ని పనులు నివారించడం వలన మీ చర్మం, జుట్టు ఆరోగ్యంగా అందంగా ఉంటుంది. ఈ సాధారణ జాగ్రత్తలు మీ రోజు వారి అలవాటులో భాగం చేసుకొని సహజమైన అందాన్ని నిలబెట్టుకోండి.