ఆత్మ అనేది భారతీయ తాత్విక భావనలో ఒక ఆలోచన. ఆత్మ అంటే చనిపోయిన తరువాత మనిషి ఆత్మగా మారతారు అని అంటారు. ఇంకొక భావన మన శరీరంలో జీవ శక్తి ని ఆత్మగా పరిగణిస్తారు. ఇది కేవలం శబ్ద భౌతిక రూపంలో వ్యక్తం అవ్వదు. కానీ శక్తిగా,జీవశక్తిగా మాత్రం ప్రసరిస్తుందని చెబుతారు. దీని వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడానికి ఆత్మ యొక్క స్వభావాన్ని, దాని లక్షణాలను దాని శక్తి రూపాన్ని పరిశీలించాల్సి ఉంటుంది.
ఆత్మ యొక్క స్వభావం: హిందూ తత్వశాస్త్రంలో ఆత్మను శాశ్వతమైన శక్తిగా పరిగణిస్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆత్మను”న జాయతే మ్రియతే వా కదాచిన్”అని వర్ణిస్తాడు అంటే ఆత్మ ఎప్పుడు పుట్టదు చనిపోదు, ఇది శరీరంతో సంబంధంలేని ఒక శక్తి. ఇది శబ్దం రూపంతో మిళితం కాదు, ఆత్మ జీవన శక్తికి చైతన్య తత్వానికి ప్రామాణికంగా చెబుతారు. ఇది శరీరంలో ప్రతి కణంలో ప్రవహిస్తుంది.
ఆత్మకు శక్తి : ఆత్మ శబ్దం కంటే శక్తిగా ప్రసరిస్తుంది, ఎందుకంటే శబ్దం అనేది మనకి వినిపించే ప్రక్రియ ఇది కంపనాల ద్వారా వ్యక్తమౌతుంది, కానీ ఆత్మా అనేది భౌతిక శక్తికి అతీతమైన ఆధ్యాత్మిక శక్తి. ఇది సమస్త జీవరాసుల్లో ఉండే శక్తిగా పరిగణిస్తారు. ఉదాహరణకు యోగశాస్త్రంలో ప్రాణం ఆత్మతో సంబంధం కలిగి ఉంటుంది. ప్రాణం శరీరంలోని శక్తి కేంద్రాల ద్వారా జీవనాన్ని నిర్వహిస్తుంది.
శబ్దం అనేది భౌతికంగా మనకు వినిపిస్తుంది. ఆత్మ అనేది ఇంద్రియాలకు అతీతమైనది ధ్యానం, ఆత్మ జ్ఞానం, ఆధ్యాత్మిక సాధన ద్వారా మాత్రమే అనుభవించబడుతుంది.ఆత్మ శబ్దం కాదు శక్తిగా ప్రచురిస్తుంది. ఇది భౌతిక పరిమితులకు అతీతమైన శాశ్వతమైన చైతన్యం. శబ్దం ఒక సాధనం మాత్రమే కానీ ఆత్మ జీవనశక్తికి సృష్టి యొక్క మూలానికి సూచిస్తుంది. ఈ శక్తిని అనుభవించడానికి ఆధ్యాత్మిక సాధన, ధ్యానం ఆత్మజ్ఞానం అవసరం.