షాకింగ్; దోమ కుట్టినా కరోనా…!

-

ఒక పక్క కరోనా వైరస్ తో జనాలు ఇబ్బంది పడుతుంటే ఈ తరుణంలో జరుగుతున్న కొన్ని ప్రచారాలు ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి అనేది వాస్తవం. చిన్న చిన్న విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా పెద్దదిగా చేస్తూ చూపిస్తున్నారు. ఏది పడితే అది ప్రచారం చేస్తూ చికాకు పెడుతున్నారు. ఒక పక్క జనం ఎలా బయటపడాలో అర్ధం కాక ఇబ్బంది పడుతున్నారు. దాని నుంచి బయటకు వచ్చే మార్గం వదిలేసి,

మద్యం తాగితే కరోనా రాదు, వెల్లుల్లి తింటే కరోనా పోతుంది, చద్ది అన్నం తింటే కరోనా వైరస్ రాదు, ఇలాంటి సోది ప్రచారాలు అన్నీ చేస్తున్నారు. ఇక తాజాగా దోమ కుడితే కరోనా వైరస్ వస్తుందని ప్రచారం చేస్తున్నారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పుడు కీలక ప్రకటన చేసింది. అలాంటి సొల్లు ప్రచారాలు నమ్మవద్దని, దయచేసి అలాంటివి అసలు నమ్మశక్యం కాదని, అలాంటి వాటిని ఏ విధంగాను విశ్వసించవద్దు వద్దని కేంద్రం సూచించింది.

మద్యం తాగడానికి కరోనా వైరస్ కి సంబంధం లేదని, వెల్లుల్లి తినడానికి కరోనా వైరస్ కి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దని కోరింది. ఇది పక్కన పెడితే దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తు౦ది. ఊహించని విధంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. 13 మంది కరోనా వైరస్ తీవ్రతకు ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news