ఇండియాకు మరో షాక్ ఇచ్చారు ట్రంప్. భారత్‌పై సుంకాలను మరింత పెంచుతానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే భారత్‌పై 25% సుంకాలను విధించింది అమెరికా. ఇక ఇప్పుడు భారత్‌పై సుంకాలను మరింత పెంచుతానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

భారత్ చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు భారీగా ఆర్థిక వనరులు చేరుతున్నాయని, అందుకే ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపడం లేదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ రష్యాతో చమురు కొనుగోలు చేస్తే సుంకాలను మరింత పెంచుతానని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్.