జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇక ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ అంత్యక్రియలలో పాల్గొనేందుకు ఝార్ఖండ్‌కు మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, కోవ లక్ష్మీ బయల్దేరారు.

కాగా, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించి ఆయన ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేశారు. ఈ పోరాటంలో ఆయన విజయం సాధించి జార్ఖండ్ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కృషి చేశారు. అనంతరం ఆయన మూడు సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ చాలా మద్దతు ఇచ్చారు.