Heavy rains in Himayat Sagar reservoir: భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ జలాశయానికి భారీగా వర్షపు నీరు వస్తోంది. దింతో హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటిమట్టం 1763 అడుగులుగా ఉంది. ఒక గేటు రెండు ఫీట్లు పైకి ఎత్తి మూసి నదిలోకి నీటి విడుదల చేశారు.

అటు హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. తరుణంలోనే మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్ జారీ చేశారు అధికారులు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో హిమాయత్‌సాగర్‌కు భారీగా వరద ప్రవాహం భారీగా పెరిగింది.