హైదరాబాద్ జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాదులో విపరీతంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆమె సెలూన్ షాప్ ఓపెనింగ్ కు వెళ్తున్న నేపథ్యంలో ఆమెపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. వర్షంలో హైదరాబాద్ ప్రజల కష్టాలను గాలికి వదిలేసి బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ కు మేయర్ విజయలక్ష్మి వెళ్లారని చర్చ జరుగుతోంది.

జూబ్లీహిల్స్ లో బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ కు జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి వెళ్లడం జరిగింది. భారీ వర్షాలతో నగరం అతలాకుతలం అవుతుంటే అది పట్టించుకోకుండా గాలికి వదిలేసి… బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ కు వెళ్లడంపై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవి ఇచ్చింది ఎన్నికైన అని నిలదీస్తున్నారు జనాలు.