పులివెందులలో హైటెన్షన్ నెలకొంది. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రారంభం అయింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పులివెందుల జడ్పీటీసీ ఫలితం గురువారం తేలనుంది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 11 మంది పోటీలో ఉన్నారు. ఈ తరుణంలో పులివెందులలో హైటెన్షన్ నెలకొంది.

పోలీసుల పహారాలో పులివెందుల ఉంది. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో ఎన్నికలు జరుగుతున్నాయి. పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడూ ఏకగ్రీవమే అయ్యాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్ వరకు ఏకగ్రీవమే అయ్యాయి. పులివెందుల కంచుకోటపై పసుపు జెండా ఎగురుతుందా? జడ్పీటీసీ స్థానం గెలిచి వైసీపీ పట్టు నిలుపుకుంటుందా? అనేది చూడాలి.