ఏపీ రైతులకు గుడ్ న్యూస్. రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పుస్తకాలను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆగస్టు 15-31 వరకు మొదటి విడతగా కొత్త పాస్ పుస్తకాలను కొంతమంది రైతులకు అందిస్తారని సమాచారం. గత ప్రభుత్వం పాస్ పుస్తకాలపై అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆ ఫోటోలను మార్చి రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పుస్తకాలను ఏపీ ప్రభుత్వం రూపొందించింది. విడతల వారీగా 20 లక్షల మందికి పైగా రైతులకు ఈ కొత్త పాస్ బుక్ లను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందించనుంది. ఇదిలా ఉండగా… మరోవైపు ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు “స్త్రీ శక్తి” పథకంతో ఉచిత బస్సు సదుపాయాన్ని ప్రారంభించనున్నారు. దీంతో మహిళలు ఎలాంటి చార్జీలు లేకుండా వారి గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.