రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తూర్పు ఈశాన్య దిశగా అరుణాచల్ ప్రదేశ్ వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర కోస్తాంధ్ర, దానికి ఆనుకుని ఉన్న తెలంగాణ ప్రాంతాలలో సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తుతో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. దింతో తెలంగాణలోని 12 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.