మహిళలను చేయి పట్టి లాగడం నేరం కాదంటూ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి దురుద్దేశం లేకుండా ఒక పురుషుడు మహిళను చేపట్టి లాగడం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. అలా చేయడం నేరం కాదని కేవలం బాధపెట్టే చర్య మాత్రమేనని పేర్కొన్నారు. 2015లో చోళవందానైకి చెందిన మురుగేషన్ ఓ దివ్యాంగురాలిని చేయి పట్టి లాగినట్లుగా ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ కేసును విచారించిన కోర్టు అతడికి మూడేళ్ల పాటు జైలు శిక్షను విధించింది. దీంతో ఆ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా శిక్షను రద్దు చేస్తూ తీర్పును ఇచ్చింది. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు బయటికి పంపించారు. అనంతరం మద్రాస్ హైకోర్టు ఓ మహిళను చేయి పట్టి లాగడం నేరం కాదంటూ తీర్పు ఇచ్చింది. దీంతో కొంతమంది వ్యక్తులు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఫైర్ అవుతున్నారు. ఇలా చేయడం వల్ల కొంతమంది పురుషులు మరింతగా రెచ్చిపోయి ప్రవర్తిస్తారని అంటున్నారు. దీనిపై మద్రాస్ హైకోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.