ఏపీలో దారుణం జరిగింది. గర్భిణీ మహిళను హత్య చేసి కాల్చి పడేశారు దుండగులు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బంజరి జాతీయ రహదారి పక్కన మహిళ మృతదేహాన్ని గమనించి, పోలీసులకు సమాచారమిచ్చారు స్థానికులు.

ఇక ఈ ఘటనా స్థలానికి చేరుకొని మహిళను కాళ్లు, చేతులు కట్టేసి, గొంతు పిసికి హత్య చేసి, మృతదేహానికి నిప్పంటించినట్టు గుర్తించారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో తనిఖీ చేస్తున్నారు పోలీసులు.