ప్రతిరోజు ఉదయం ఎలా మొదలవుతుందో ఆ రోజంతా మన శరీరం, మనసు మీద ప్రభావం చూపుతుంది. కొందరికి రోజంతా చాలా సంతోషంగా అనిపిస్తుంది. కొందరికి రోజు చాలా కష్టంగా, భారంగా అనిపిస్తుంది. ఇలా అనిపించడానికి కారణం మనం రోజు ఉదయం నిద్ర లేవగానే చేసే పనులే కారణం. అందుకే ఉదయం లేస్తూనే కొన్ని అలవాట్లు దూరంగా ఉంచడం ద్వారా మీరు ఆరోగ్యం ఉత్సాహంగాను గడపవచ్చు. మరి అలాంటి అలవాట్లు అని ఇప్పుడు తెలుసుకుందాం..
మొదటగా మొబైల్ ఫోన్ చెక్ చేయడం చాలా మంది చేసే ప్రధాన పొరపాటు. నిద్ర లేవగానే నేరుగా ఫోన్ చూడడం వల్ల మన మెదడు పై ఒత్తిడి పెరుగుతుంది, మెసేజ్, సోషల్ మీడియా నోటిఫికేషన్లు మొదలుపెట్టిన తర్వాత ఆపకుండా చూస్తూనే ఉంటారు. దీనివల్ల మెదడుపై స్ట్రెస్ పెరిగి మనకి రోజంతా భారంగా అనిపిస్తుంది. అందుకే లేవగానే కనీసం 30 నిమిషాల తర్వాతే ఫోన్ చూడడం అలవాటు చేసుకోండి.
రెండవది మన మొబైల్లో అలారం స్నూజ్ కొట్టడం. అలారం మోగగానే దాని ఆఫ్ చేయకుండా నిద్రలో స్నూజ్ కొట్టేస్తాం. మళ్లీ పది నిమిషాల తర్వాత అలారం మోగుతుంది. ఇలా చేస్తే శరీరానికి సరైన విశ్రాంతి దొరకదు పైగా లేవగానే శబ్దత, అలసట ఎక్కువగా ఉంటుంది. అందుకే అలారం మోగగానే నిద్రలేవడం అలవాటు చేసుకోండి.

ఇక మూడవది ఉదయం లేస్తూనే మంచం మీద ఎక్కువ సేపు పడుకోవడం. ఇలా చేస్తే మనకి రోజంతా బద్ధకంగా అనిపిస్తుంది. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరిగా చేరదు. లేవగానే కిటికీ తీయడం. లోతుగా శ్వాసించడం చాలా మంచిది. ఇంటి ఎదురుగా ఏదైనా పచ్చని చెట్లు ఉంటే నిద్ర లేవగానే ఆ పచ్చని చెట్టుని చూస్తూ చిన్న స్మైల్ తో రోజుని స్టార్ట్ చేస్తే ఎంత ఉత్సాహంగా ఉంటుంది.
ఇక నాలుగవది టీ, కాఫీ వెంటనే తాగడం ఇది ఆరోగ్యానికి ఎంతో హానికరం ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగితే ఆమ్లత్వం పెరుగుతుంది. అందువల్ల ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోండి ఆ తర్వాత టీ కాఫీ ఏదైనా సేవించండి.
ఇక చివరిగా తీవ్రమైన ఆలోచన లేదా నెగిటివ్ భావనలను మదిలోకి రానివ్వడం. నిద్ర లేవగానే మార్నింగ్ టైం లో మన మెదడు అత్యంత శక్తివంతంగా ఉంటుంది. ఆ టైంలో మీరు పాజిటివ్ ఆలోచనలు ధ్యానం చిన్న వ్యాయామం లేదా ఏదైనా దేవుడి ప్రార్థనతో రోజును ప్రారంభిస్తే ఎంతో ఉత్సాహంగా గడపవచ్చు. ఉదయం ఆరంభం ఆరోగ్యకరమైన అలవాట్లతో ఉంటే మీ శరీరం, మనసు రోజంతా ఎనర్జీతో నిండి ఉంటాయి. ఈ అలవాట్లను మీ రోజు వారి జీవితంలో ట్రై చేసి చూడండి..