అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు మంత్రి జూప‌ల్లి ఆదేశం

-

అప్రమత్తంగా ఉండండి అని.. అధికారులకు మంత్రి జూప‌ల్లి ఆదేశించారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు జిల్లా ఇంచార్జ్ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. ఆదిలాబాద్, నిర్మ‌ల్ క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.

jupally
District in-charge Minister Jupalli Krishna Rao has ordered the authorities to be on full alert in the wake of heavy rains in Ummadi Adilabad district

శాఖ‌ల వారీగా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై దిశానిర్దేశం చేశారు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. రిజర్వాయర్లకు సంబంధించిన ఇన్ ఫ్లూ, అవుట్ ఫ్లో గురించి ఆరా తీస్తున్నారు. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి పంట న‌ష్టంపై నివేదిక త‌యారు చేయాల‌ని సూచనలు చేశారు. చెరువులకు, కాల్వ‌ల‌కు గండ్లు ప‌డిన‌ట్లైతే వెంట‌నే వాటిని పూడ్చివేయాల‌ని, రోడ్ల మ‌రమ్మ‌త్తులు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు.

Read more RELATED
Recommended to you

Latest news