రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పందించారు. ఓటు చోరీ ఆరోపణల్లో ఆధారాలు లేవని వెల్లడించారు. కొంత మంది ఓటర్లు డబుల్ ఓటింగ్ చేశారని ఆరోపించారన్నారు. రుజువు అడిగినప్పుడు, సమాధానం ఇవ్వలేదని వెల్లడించారు. ఎన్నికల కమిషన్ లేదా ఏ ఓటరు కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలకు భయపడరు…

ఎన్నికల కమిషన్ భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్. బీహార్‌లో SIR ప్రారంభించాం… 1.6 లక్షల మంది బూత్ లెవెల్ ఏజెంట్లు ఒక ముసాయిదా జాబితాను సిద్ధం చేశారన్నారు. ప్రతి బూత్‌లో ఈ ముసాయిదా జాబితాను సిద్ధం చేస్తున్నప్పుడు, అన్ని రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు తమ సంతకాలతో దానిని ధృవీకరించారని వెల్లడించారు. ఓటర్లు మొత్తం 28,370 క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సమర్పించారని పేర్కొన్నారు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.