చూడాలని ఉన్నా నిను చూడలేకున్నా.. రామ్ చరణ్‌పై బన్నీ ట్వీట్

-

కరోనా ధాటికి జనమంతా ఇంటికే పరిమితమయ్యారు. మన దేశంలో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించడంతో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రజలంతా ఇంటికి పరిమితమవ్వండి.. సురక్షితంగా ఉండండి అని పదే పదే చెబుతున్నారు. దీంతో స్టార్ హీరోల నుంచి సామాన్య జనం వరకు అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. అయితే తన ప్రియ సోదరుడి పుట్టిన రోజు సందర్భంగా కలవగలనో లేదోనని అల్లు అర్జున్ తెగ ఫీలైపోతున్నాడు.

నేడు (మార్చి 27) రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు తనపై కురిపిస్తున్న ప్రేమకు ముగ్దుడైన రామ్ చరణ్.. సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యాడు. ఇంట్లోనే ఉండండి సురక్షితంగా ఉండండి.. అదే తనకిచ్చే గొప్ప బహుమతి అని రామ్ చరణ్ వేడుకున్నాడు.

తాజాగా అల్లు అర్జున్ రామ్ చరణ్‌కు విషెస్ చెబుతూ.. ‘ఈ ఏడాది నీ జీవితంలో సంతోషం, విజయం రావాలని కోరుకుంటున్నాను.. నేను నిన్ను ఈ రోజు చూడాలని అనుకుంటున్నాను.. అయితే కానీ అది కుదరకపోవచ్చు.. మన మంచి కోసం ఐసోలేషన్‌ను పాటిస్తున్నాం’ అంటూ హృదయం బద్దలైన ఎమోజీని షేర్ చేశాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news