తెలంగాణాలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తుంది. ఇప్పుడు మూడో దశకు కరోనా వైరస్ చేరుకునే అవకాశాలు కనపడుతున్నాయి. దీన్ని ఏ విధంగా అదుపు చెయ్యాలి అనే దానిపై తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు కసరత్తులు చేస్తుంది. పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నా సరే కరోనా వైరస్ మాత్రం విస్తరిస్తుంది. ఇప్పుడు రెండో దశ దాటి మూడో దశకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి.
దీనితో తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. మార్చి 31 వరకే కర్ఫ్యూను అమలు చేస్తామని కెసిఆర్ చెప్తున్నారు. అయితే ఇప్పుడు దీన్ని వచ్చే నెల 14 వరకు పొడిగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు కరోనా కేసులు మరిన్ని పెరుగుతున్నందున రాత్రి పూట కర్ఫ్యూను ఏప్రిల్ 14 వరకు కొనసాగించాలని సీఎం భావిస్తున్నారు.
ఏప్రిల్ 16 వరకు కర్ఫ్యూతో పాటు.. లాక్‌డౌన్ కూడా కొనసాగించే అవకాశాలున్నాయని రాష్ట్రంలో కరోనా కట్టడి, లాక్ డౌన్, కర్ఫ్యూ అమలు విషయాలపై ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.