పెరుగుతున్న బంగారం ధర…!

-

కరోనా ప్రభావం తో డిమాండ్ తగ్గిపోయినా సరే బంగారం ధరలు మాత్రం పెరుగుదల ఆగడం లేదు. వరుసగా పెరుగుతూనే ఉంది బంగారం ధర. వెండి అటు ఇటు గా ఉన్నా సరే బంగారం మాత్రం పెరుగుదల నమోదు చేస్తుంది. అంతర్జాతీయం గా కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.180 పెరగడంతో…

రూ.44,810కు చేరుకుంది బంగార౦. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.180 పెరగడంతో రూ.41,260కు చేరుకుది. ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.180 పెరగడంతో… రూ.42,050కు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.180 పెరగడంతో రూ.43,250కు చేరుకుంది.

ఇక కేజీ వెండి విషయానికి వస్తే… ధర రూ.310 తగ్గుదలతో రూ.41,500కు దిగి వచ్చింది. దాదాపు వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో 1640 డాలర్ల సమీపంలో చేరుకుంది. పసిడి ధర ఔన్స్‌కు 0.75 శాతం తగ్గడ౦తో 1639.640 డాలర్ల వద్ద ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news