సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను 10 జన్‌పథ్‌లో కలిశారు ముఖేష్ అంబానీ. అంబానీ, అదానీల వ్యవహారం నిన్నటినుంచి ముదురుతోంది. ముఖేష్ అంబానీకి చెందిన ORF అనే NGOపై నిన్నటి నుంచి తెగ నెగెటివ్ ప్రచారం జరుగుతోంది. దింతో కార్పొరేట్ గొడవలు తారస్థాయికి చేరుకున్నాయి.

ఈ నేపథ్యంలో.. సోనియా, రాహుల్‌లను ముఖేష్ కలవడంపై రాజకీయ ఊహాగానాలు నెలకొన్నాయి.
ఎన్డీయే ప్రభుత్వం కూలిపోతుందా? అని వివిధ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
ఇక అటు నామినేషన్ వేశారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఇండియా కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేశారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఈ నామినేషన్ కార్యక్రమంలో మల్లిఖార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.