రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్ లో మాజీ మంత్రి నారాయణ స్వామి పైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పుత్తూరులోని ఆయన ఇంట్లో సిట్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కేసులో మరింత లోతు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం నారాయణ స్వామి నివాసానికి వెళ్లారు. గత ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తి నుంచి ఒత్తిడి వల్లే లిక్కర్ పాలసీపై నారాయణస్వామి సంతకాలు పెట్టినట్లు సీట్ అధికారులు అనుమానిస్తున్నారు.
అప్పటి ముఖ్యమంత్రి జగన్ లిక్కర్ పాలసీని తీసుకొచ్చిన సమయంలో నారాయణస్వామి మంత్రిగా ఉండటంతో సిట్ అధికారులు ఆయనను విచారించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు లిక్కర్ పాలసీలో తీసుకొచ్చిన మార్పుల పై ఆరా తీయనున్నారు. ఆర్డర్స్, ఆన్ లైన్ విధానం తొలగింపు తో పాటు మాన్యువల్ విధానాన్ని తీసుకురావడం పైన ప్రశ్నించనున్నారు. అలాగే మద్యం పాలసీలో జరిగిన మార్పులు, వాటి వెనుక ఎవరున్నారు..? అని నారాయణ స్వామిని సిట్ పోలీసులు విచారించనున్నారు.